Viral News: ఎవరీ కుర్రాడు..? అని డౌట్ వచ్చిందా..? నిన్నటిదాకా పూరి గుడిసెలోనే బతికిన ఇతడు ఇప్పుడేం చేస్తున్నాడో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-09-06T20:31:35+05:30 IST

సకల సౌకర్యాలు ఉన్నా.. ఎంత ఖర్చు చేయడానికి వెనుకాడని తల్లిదండ్రులు ఉన్నా కూడా చాలా మంది పిల్లలు చదువులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా.. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంటారు. మరికొందరు కనీస వసతులు లేకున్నా..

Viral News: ఎవరీ కుర్రాడు..? అని డౌట్ వచ్చిందా..? నిన్నటిదాకా పూరి గుడిసెలోనే బతికిన ఇతడు ఇప్పుడేం చేస్తున్నాడో తెలిస్తే..!

సకల సౌకర్యాలు ఉన్నా, ఎంత ఖర్చు చేయడానికి వెనుకాడని తల్లిదండ్రులు ఉన్నా కూడా చాలా మంది పిల్లలు చదువులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా.. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంటారు. మరికొందరు కనీస వసతులు లేకున్నా.. తమ పట్టుదలను మాత్రం విస్మరించకుండా చివరికి విమర్శించిన వారు కూడా అశ్చర్యపోయేలా చేస్తుంటారు. ఇలాంటి విజేతల గురించి తరచూ వింటూనే ఉన్నాం. ప్రస్తుతం చెప్పుకోబోయే యువకుడు కూడా ఈ కోవకే చెందుతాడు. నిన్నటిదాకా పూరి గుడిసెలోనే బతికిన ఇతడు ఇప్పుడేం చేస్తున్నాడో తెలిస్తే..!.. శభాష్ అని అనకుండా ఉండలేరు..

రాజస్థాన్ బార్మర్ జిల్లాలోని (Rajasthan Barmer District) మారుమూల గ్రామమైన గూడమలానీ నగర్‌‌.. ప్రస్తుతం వార్తలో నిలిచింది. కనీస వసతులు కూడా లేని ఈ గ్రామస్తులకు ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక కల. ఆ కలను ఇటీవల ఓ కూలీ కొడుకు సాకారం చేశాడు. రాష్ట్రంలో ఇటీవల గ్రేడ్ థర్డ్ టీచర్ రిక్రూట్‌మెంట్ (Rajasthan Grade 3 Teacher Recruitment 2023) ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో గూడమలానీ నగర్‌‌కు చెందిన దినసరి కూలీ గూర్ఖారామ్ మేఘ్వాల్ కుమారుడు నర్సిగారం అనే యువకుడు.. ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మొదటి వ్యక్తి ఇతనే కావడం గమనార్హం. తండ్రి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించడం చూసి నర్సిగారం చలించిపోయేవాడు. ఎలాగైనా బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు.

Metro Train: రద్దీగా ఉన్న మెట్రో రైల్లో ప్రేమ జంట రొమాన్స్.. ఓ ఆంటీకి చిర్రెత్తుకొచ్చి ఏం చేసిందో మీరే చూడండి..!

rajastan-teacher.jpg

అందుకు తగ్గట్టుగానే రోజూ 8నుంచి 10గంటల పాటు కష్టపడి చదివేవాడు. అంతేకాకుండా సుమారు 12వ తరగతి చదువుతున్న సమయంలో స్కూల్‌కు రోజూ 10నుంచి 12కిలోమీటర్లు కాలినడకన వెళ్లేవాడు. ఇలా కష్టపడి చదివి పదో తరగతిలో 68.68శాతం, 12వ తరగతిలో 79శాతం మార్కులు సాధించాడు. చివరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలన్న తన కలను సాకారం చేసుకున్నాడు. టీచర్ ఫలితాలు వెలువడగానే గూడమలానీ నగర్‌‌లో సంబరాలు మిన్నంటాయి. తమ గ్రామంలో మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన నర్సింగారాన్ని గ్రామస్తులంతా కలిసి ఘనంగా సన్మానించారు. తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో ట్యూషన్‌కు వెళ్లలేదని నర్సిగారం తెలిపాడు. రోజూ ఇంట్లోనే సొంతంగా చదువుకునేవాడినని, తన తల్లిదండ్రుల కలలను సాకారం చేయడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. అలాగే తన లాంటి విద్యార్థులకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపాడు.

Laborer-son-becomes-teacher.jpg

Viral Video: సింహాలను చూసి ఆగిపోయిన వాహనాలు.. ఆరటిపండ్ల వ్యాపారి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా సడన్‌గా రావడంతో..

Updated Date - 2023-09-06T20:31:35+05:30 IST