Viral Video: ఈ మేకలు ఉన్నది భూమి మీద కాదు.. ఉప్పు కోసం ఇవి ఎలాంటి సాహసం చేశాయో చూస్తే.. కళ్లు బయర్లు కమ్మాల్సిందే..

ABN , First Publish Date - 2023-07-30T19:29:19+05:30 IST

జంతువులు ఆహారాన్వేషణలో వివిధ రకాల సాహసాలు చేస్తుంటాయి. అయితే కొన్ని జంతువులు చేసే ఫీట్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. పులులు, సింహాలు, ఏనుగులు తదితర జంతువులు వాటి ఆహార వేటలో ఎలాంటి సాహసం చేస్తాయో చూస్తూ ఉంటాం. ఇలాంటి..

Viral Video: ఈ మేకలు ఉన్నది భూమి మీద కాదు.. ఉప్పు కోసం ఇవి ఎలాంటి సాహసం చేశాయో చూస్తే.. కళ్లు బయర్లు కమ్మాల్సిందే..

జంతువులు ఆహారాన్వేషణలో వివిధ రకాల సాహసాలు చేస్తుంటాయి. అయితే కొన్ని జంతువులు చేసే ఫీట్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. పులులు, సింహాలు, ఏనుగులు తదితర జంతువులు వాటి ఆహార వేటలో ఎలాంటి సాహసం చేస్తాయో చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం పర్వత మేకలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నిటారుగా ఉన్న ఎత్తైన గోడల పైకి సునాయాశంగా ఎక్కేసిన మేకలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఇటలీలోని (Italy) ఆంట్రోనా వ్యాలీ నేచురల్ పార్క్‌లోని డ్యామ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా పర్వత మేకలు అత్యంత ఎత్తులో ఉన్న డ్యామ్ గోడలను (Mountain goats climbing wall) సునాయాశంగా ఎక్కేశాయి. అంతెత్తున్న దేనికోసమే వెతుకుతున్నట్లు కనిపించాయి. చివరకు డ్యామ్ గోడలపై పేరుకుపోయిన పోషక లవణాలను రుచి చూస్తాయి. ఇలా మేకలన్నీ భూమి మీద ఉన్నట్లుగానే గోడలపై ఉప్పు కోసం వెతుకుతూ, అటూ ఇటూ తిరగడం చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటుంది. ఇలా చాలా సేపు గోడలపై లవణాలను తీసుకున్న మేకలు.. తర్వాత గోడ పైనుంచి అంతే వేగంగా కిందకు పరుగెత్తుకుంటూ వెళ్తాయి.

Smart phone: ఇతడి ఫోన్ పాస్‌వర్డ్ గుర్తు పెట్టుకోవడం.. కంప్యూటర్‌కీ సాధ్యం కాదేమో.. ఎలా అన్‌లాక్ చేస్తున్నాడో మీరే చూడండి..

నిటారుగా ఉన్న గోడపై ఉన్నా.. ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా కిందకు వెళ్లిపోతాయి. ఈ మేకలు గోడలపైకి ఎక్కే విధానం, కిందకు దిగే విధానం చూస్తే.. వీటికేమైనా అద్భుత శక్తులేమైనా ఉన్నాయా అని అనిపిస్తుంది. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఈ మేకలు చేసిన సాహసం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! చూస్తుంటేనే కళ్లు తిరుగుతున్నాయ్’’.. అని కొందరు, ‘‘అరె! ఇది ఎలా సాధ్యమైంది’’.. అని మరికొందరు, ‘‘నిజంగా ఇది అద్భుతమే’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: అప్పటిదాకా కేవలం కుక్కలే కదా అనుకున్నాడు.. ఒకే ఒక్క ఘటనతో వాటి ఉపయోగం తెలిసొచ్చింది.. నిమిషం ఆలస్యం అయ్యున్నా..

Updated Date - 2023-07-30T19:29:19+05:30 IST