Share News

Bhanuprakash: మసిపూసి మారేడుకాయలా మాపై నిందలా.. జగన్‌పై బీజేపీ నేత ఫైర్

ABN , Publish Date - Jul 20 , 2024 | 10:53 AM

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ జగన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై ఆయన మండిపడ్డారు. ‘‘జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తాడంట’’ అంటూ ఎద్దేవా చేశారు. ఐదేళ్లల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ కోరాలన్నారు.

Bhanuprakash: మసిపూసి మారేడుకాయలా మాపై నిందలా.. జగన్‌పై బీజేపీ నేత ఫైర్
BJP Leader Bhanuprash Reddy

అమరావతి, జూలై 20: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి (BJP Leader Bhanuprash Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ జగన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై ఆయన మండిపడ్డారు. ‘‘జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తాడంట’’ అంటూ ఎద్దేవా చేశారు. ఐదేళ్లల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ కోరాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన దాడులు, దారుణాలపై ధర్నాలో చెప్పాలన్నారు.

Rain Alert: ఈ ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. 11 జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్..


ఆ ఘనత జగన్‌దే...

ఐదేళ్లల్లో సీఎంగా జగన్ ప్రజలు, పత్రికలపై చేసిన దాడి లోకమంతా చూసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా ఆందోళన ప్రదేశ్‌గా మార్చిన ఘనత జగన్‌కే దక్కిందని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి వాతావరణం ‌కల్పించిందని తెలిపారు. కక్ష సాధింపులు కాదని... అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌వైపు అడుగులు వేస్తుందిని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో అరాచకాలు దేశంలోనే చర్చగా మారాయన్నారు. జగన్ ఇప్పుడు మసిపూసి మారేడుకాయ అన్న చందంగా తమ మీద నిందలు వేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తామని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.

Elon Musk: ప్రధాని మోదీకి ఎలన్ మస్క్ అభినందనలు..


ఢిల్లీలో ధర్నా: జగన్

కాగా.. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఈనెల 24న ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న (శుక్రవారం) వినుకొండలో నడిరోడ్డుపై హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శించి ఆపై మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని అన్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలువనున్నట్లు తెలిపారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధానికి వివరించనున్నట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

Ketireddy Peddareddy: పోలీస్‌స్టేషన్‌కు పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హైటెన్షన్

Heavy Rain: బాబోయ్ వర్షం... హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

Read Latest AP News And Telugu News


Updated Date - Jul 20 , 2024 | 10:58 AM