Share News

Viral Video: ఇదెక్కడి పీతరా బాబూ..! ప్రాణాలు పోతున్నా చివరి కోరికను ఎలా తీర్చుకుందంటే..

ABN , Publish Date - May 11 , 2024 | 05:44 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని వీడియోలు చూస్తే ఇదెలా సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. మరికొన్ని నమ్మశక్యంగా అనిపించకపోయినా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా...

Viral Video: ఇదెక్కడి పీతరా బాబూ..! ప్రాణాలు పోతున్నా చివరి కోరికను ఎలా తీర్చుకుందంటే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని వీడియోలు చూస్తే ఇదెలా సాధ్యం.. అని అనిపిస్తుంటుంది. మరికొన్ని నమ్మశక్యంగా అనిపించకపోయినా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఉడుకుతున్న పాత్రలో చావబోతున్న పీత.. తన చివరికోరికను తీర్చుకోవడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంతకీ ఆ పీత ఏం చేసిందో మీరూ చూసేయండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పీతల కూర చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటాడు. ఈ క్రమంలో పాత్రలో కొన్ని పీతలతో (crabs) పాటూ మొక్కజొన్నలు (corns) తదితరాలను వేసి ఉడకబెడతాడు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అంత వరకూ చలనం లేకుండా పడి ఉన్న పీతకు.. ఎదురుగా ఉన్న మొక్కజొన్న గింజెలను చూసి ఎక్కడలేని ఆకలి పుట్టినట్లుంది.

Viral Video: వేదిక పైనే మరదలితో కలిసి డాన్స్ చేసిన వరుడు.. ఓపిగ్గా చూసిన వధువు.. చివరకు..


పోయే ప్రాణం ఎలాగూ పోతోంది.. పోతూ పోతూ ఆకలి అయినా తీర్చుకుందాం అనుకుందో ఏమో గానీ.. ఎంచక్కా ఎదురుగా ఉన్న మొక్క జొన్నలను పీక్కుని లాగించేసింది. ఓ వైపు నీళ్లలో ఉడికిపోతున్నా.. మరోవైపు తాపీగా మొక్కజొన్నలను తింటూ ఉంది. ఇది చూసేందుకు నమ్మశక్యంగా అనిపించకపోయినా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘పీత లాస్ట్ ఫుడ్’’.. అంటూ కొందరు, ‘‘దీన్ని ధైర్యానికి సలాం చేయాల్సిందే’’.. అంటూ మరికొందరు, ‘‘పీతనా.. మజాకా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: నిర్మానుష్య ప్రదేశంలో ఆటోను ఆపిన డ్రైవర్.. ఏం చేస్తున్నాడని చూడగా.. వెనుక సీట్లో..

Updated Date - May 11 , 2024 | 05:44 PM