Share News

Viral Video: మాస్క్‪‌తో ఎదురుగా వచ్చిన యువతిని చూసి.. ఈ గుర్రం చేసిన నిర్వాకం..

ABN , Publish Date - May 11 , 2024 | 05:02 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు యువతులు బహిరంగా ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు చేస్తూ నవ్విస్తుంటే.. మరికొందరు జంతువులతో కలిసి ఏవేవో పిచ్చి పచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా...

Viral Video: మాస్క్‪‌తో ఎదురుగా వచ్చిన యువతిని చూసి.. ఈ గుర్రం చేసిన నిర్వాకం..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు యువతులు బహిరంగా ప్రదేశాల్లో ప్రాంక్ వీడియోలు చేస్తూ నవ్విస్తుంటే.. మరికొందరు జంతువులతో కలిసి ఏవేవో పిచ్చి పచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి ఓ ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి గుర్రం తల ఆకారంలో ఉన్న మాస్క్ తగిలించుకుని ఏకంగా నిజమైన గుర్రం ముందకే వెళ్లింది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలోని అనేక మాధ్యమాల్లో చాలా పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) గుర్రం తల ఆకారంలో ఉన్న మాస్క్ (horse Mask) తగిలించుకుని నిజమైన గుర్రం వద్దకు వెళ్లింది. గుర్రం కూడా ఆ యువతిని చూసి అలాగే చూస్తుండిపోయింది. చివరకు సదరు యువతి గుర్రానికి అతి సమీపంగా వెళ్లింది. దీంతో గుర్రం ఆశ్చర్యంగా ఆమె మాస్క్‌నే గమనిస్తూ ఉంది. ‘‘ఇదేంటీ.. అచ్చం నాలాగే ఉందే’’.. అనుకుంటూ బొమ్మ గుర్రానికి ముద్దులు కూడా పెడుతుంది. ఈ క్రమంలో యువతి ఉన్నట్టుండి ఆ మాస్క్‌ను తీసేసి, తన నిజమైన రూపాన్ని బయటపెడుతుంది.

Viral Video: వేదిక పైనే మరదలితో కలిసి డాన్స్ చేసిన వరుడు.. ఓపిగ్గా చూసిన వధువు.. చివరకు..


తన ఎదురుగా ఉన్నది గుర్రం కాదు మనిషి అని తెలుసుకున్న గుర్రం.. అక్కడి నుంచి భయంతో పారిపోతుంది. ‘‘వామ్మో.. ఇది ఊహించని షాక్’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ అక్కడి నుంచి చెంగుచెంగున పరుగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. గుర్రం భయపడడం చూసి అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘గుర్రం ఆశలు.. అడియాశలయ్యాయి’’.. అంటూ కొందరు, ‘‘గుర్రానికి భలే షాక్ ఇచ్చిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నిర్మానుష్య ప్రదేశంలో ఆటోను ఆపిన డ్రైవర్.. ఏం చేస్తున్నాడని చూడగా.. వెనుక సీట్లో..

Updated Date - May 11 , 2024 | 05:02 PM