Share News

Viral Video: దయ్యాలను కూడా భయపెడుతున్న రైతు.. పొలంలో ఎలాంటి ఏర్పాట్లు చేశాడంటే..

ABN , Publish Date - May 11 , 2024 | 10:00 PM

పంటపొలపై అడవి జంతువులు, పక్షులు దాడి చేసి నాశనం చేయడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. ఈ క్రమంలో తమ పంటను రక్షించుకునేందుకు చాలా మంది రైతులు వినూత్న పద్ధతులను అవలంభిస్తుంటారు. చాలా మంది...

Viral Video: దయ్యాలను కూడా భయపెడుతున్న రైతు.. పొలంలో ఎలాంటి ఏర్పాట్లు చేశాడంటే..

పంటపొలపై అడవి జంతువులు, పక్షులు దాడి చేసి నాశనం చేయడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇలాంటి సమయాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. ఈ క్రమంలో తమ పంటను రక్షించుకునేందుకు చాలా మంది రైతులు వినూత్న పద్ధతులను అవలంభిస్తుంటారు. చాలా మంది పక్షులను తరిమికొట్టేందుకు తమ పొలాల్లో దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన పొలంలోకి పక్షులు రాకుండా ఉండేందుకు చేసిన ఏర్పాట్లు చేసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైతు (Farmer) తన పంట పొలంలోకి పక్షులు తదితరాలు రాకుండా ఉండేందుకు అందరిలా కాకుండా ఏదైనా వినూత్నంగా చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం ఎవరూ చేయని విధంగా దిష్టిబొమ్మను (Scarecrow) తయారు చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ముందుగా తన పొలంలో ఓ కర్రను పాతి, దాని పైన ఓ దయ్యం (devil) బైకు నడపుతున్నట్లుగా బొమ్మను తయారు చేశాడు. దాన్ని చూస్తే ఆకాశలో దయ్యం బైకు నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. అది కూడా గాలికి అటూ ఇటూ తిరుగుతూ అందిరినీ భయపెట్టేలా ఉంది.

Viral Video: లవ్ సింబల్ వెలుగులో ప్రేమికుల రొమాన్స్.. మధ్యలో ఎంటరై.. ఇతను చేసిన పని..


ఈ దయ్యం బొమ్మను చూసి పక్షులు దరిదాపుల్లోకి కూడా రాకుండా పారిపోతున్నాయి. దీన్ని చూస్తే పక్షులే కాకుండా మనుషులు కూడా భయంతో పారిపోయేలా ఉంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో.. దీన్ని చూస్తే దయ్యాలు కూడా పారిపోవాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ రైతు చాలా స్మార్ట్ గురూ’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 94 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వేదిక పైనే మరదలితో కలిసి డాన్స్ చేసిన వరుడు.. ఓపిగ్గా చూసిన వధువు.. చివరకు..

Updated Date - May 11 , 2024 | 10:00 PM