Share News

Viral Video: మేకతో సెల్ఫీ దిగిన యువతి.. చివర్లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

ABN , Publish Date - May 12 , 2024 | 08:00 AM

కొందరికి సెల్ఫీల పిచ్చి పీక్స్‪‌లో ఉంటుంది. కంటికి కనపడే ప్రతి దృశ్యాన్నీ తమ కెమెరాలో బంధించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అసలుకే ఎసరు వస్తుంటుంది. కొందరు వాహనాల్లో వెళ్తూ సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు...

Viral Video: మేకతో సెల్ఫీ దిగిన యువతి.. చివర్లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఏంటంటే..

కొందరికి సెల్ఫీల పిచ్చి పీక్స్‪‌లో ఉంటుంది. కంటికి కనపడే ప్రతి దృశ్యాన్నీ తమ కెమెరాలో బంధించాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అసలుకే ఎసరు వస్తుంటుంది. కొందరు వాహనాల్లో వెళ్తూ సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు జంతువులతో సెల్ఫీలు దిగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి మేకతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించింది. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) సెల్ఫీల పిచ్చి చివరకు తన ప్రాణాల మీదకు వచ్చిపడింది. తాడుతో కట్టేసి ఉన్న మేకను చూసిన ఆమెకు సెల్ఫీ దిగాలని కోరిక పుట్టింది. ‘‘మేకే కదా ఏం చేస్తుంది.. అందులో తాడుతో కట్టేసి ఉంది’’.. అని అనుకుంటూ ఫోన్ బయటికి తీసి, దాని ఎదురుగా నిల్చుని వివిధ రకాలుగా ఫోజులు (selfie with goat) ఇస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంది.

Viral Video: లవ్ సింబల్ వెలుగులో ప్రేమికుల రొమాన్స్.. మధ్యలో ఎంటరై.. ఇతను చేసిన పని..


దూరం నుంచి యువతిని గమనించిన మేక.. కాసేపటికి సమీపానికి వచ్చింది. ‘‘నా అనుమతి లేకుండా.. నన్నే ఫొటోలు తీస్తావా’’.. అని అన్నట్లుగా.. రెండు అడుగులు వెనక్కు వేసి, వేగంగా ముందుకు వచ్చి యువతిని ఢీకొడుతుంది. దెబ్బకు ఆమె దూరంగా పడిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ మేక చాలా విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘సెల్ఫీ అంటే ఈ మేకకు నచ్చదేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వేదిక పైనే మరదలితో కలిసి డాన్స్ చేసిన వరుడు.. ఓపిగ్గా చూసిన వధువు.. చివరకు..

Updated Date - May 12 , 2024 | 08:00 AM