Share News

Viral Video: పొట్టకూటి కోసం పామును ఇబ్బంది పెట్టలేక.. రోడ్డుపై వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:48 PM

‘‘కూటికోసం కోటి విద్యలు’’.. అన్న సామెత చందంగా పొట్ట కూటి కోసం ఎంతో మంది నిత్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రోడ్డుపై వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో...

Viral Video:  పొట్టకూటి కోసం పామును ఇబ్బంది పెట్టలేక.. రోడ్డుపై వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..

‘‘కూటికోసం కోటి విద్యలు’’.. అన్న సామెత చందంగా పొట్ట కూటి కోసం ఎంతో మంది నిత్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రోడ్డుపై వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది కోతులు, కుక్కలు, పాములను ఆడించి సొమ్ము చేసుకుంటుంటారు. ఇలాంటి వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలు కొందరు ఇలాగే చేశారు. అయితే తమ పొట్టకూటి కోసం పాములను ఇబ్బంది పెట్టలేక.. చివరకు విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు రోడ్లపై పాములు (snakes) ఆడిస్తూ డబ్బులు సంపాదించడం చూస్తుంటాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని వారు కూడా ఇలాగే చేశారు. అయితే దాని కోసం పాములను ఎందుకు ఇబ్బంది పెట్టడం.. అని అనుకున్నారో ఏమో గానీ.. చివరకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

Viral Video: ఇదెక్కడి ఐడియారా అయ్యా.. బైకును బస్సులా మార్చాడే.. వీడియో చూస్తే షాకవ్వడం ఖాయం..


ఆ ఇద్దరిలో ఓ యువకుడు పాము ఆకారంలో పెద్ద తోక తయారు చేశాడు. దాన్ని తన శరీరానికి అంటించుకన్నాడు. అలాగే కడుపు, ముఖంపై పాము (man painted the body shape of snake) ఆకారంలో పెయింటింగ్ చేసుకున్నాడు. ఇలా ఫైనల్‌గా చూడ్డానికి అచ్చం పాములా తయారయ్యాడు. ఆ తర్వాత రోడ్డుపై ఓ వ్యక్తి బూర ఊదుతుంటూ... ఇతడు నేలపై పడుకుని పాములా మెలికలు తిరుగుతూ నాట్యం చేస్తున్నాడు.

Viral Video: రొమాంటిక్‌గా రీల్ చేయాలనుకున్న జంట.. మధ్యలో ఎంటరైన కుక్క.. చివరకు కంపు కంపు చేసిందిగా..


వీరి నిర్వాకం చూసి చుట్టూ ఉన్న జనం షాక్ అయ్యారు. ఇక అమ్మాయిలైతే.. సడన్‌గా వీరిని చూసి షాకై, దూరంగా పారిపోయారు. ఇలా ఆ ఇద్దరూ కలిసి ఇలా అంతా అవాక్కయ్యేలా ప్రవర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాములా భలే యాక్ట్ చేస్తున్నాడే’’.. అంటూ కొందరు, ‘‘అచ్చం కింగ్ కోబ్రాలా ఉన్నాడే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..

Updated Date - Jul 26 , 2024 | 03:48 PM