Share News

Viral Video: ప్రధాని నివాసానికి ‘దీపోజ్యోతి’.. ఘన స్వాగతం పలికిన మోదీ.. వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 14 , 2024 | 03:26 PM

ప్రధాని మోదీ ఇంట్లోకి ప్రత్యేక అతిథి అడుగిడింది. అతిథికి మోదీ పేరు పెట్టారు. శాలువా కప్పి, ప్రత్యేక పూజలు చేశారు. ఇంతకీ ఆ అతిథి ఎవరంటే.

Viral Video: ప్రధాని నివాసానికి ‘దీపోజ్యోతి’.. ఘన స్వాగతం పలికిన మోదీ.. వీడియో వైరల్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలోకి ఓ ప్రత్యేక అతిథి అడుగుపెట్టింది. ఆ అతిథికి స్వయానా మోదీనే దీపో జ్యోతి అని పేరు కూడా పెట్టారు. ఈ ప్రత్యేక అతిథిని ప్రేమగా ఆహ్వానించిన మోదీ.. శాలువా కప్పి, ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ప్రత్యేక అతిథి ఎవరు, ప్రధాని ఇంటికి ఎందుకు వచ్చింది.. అన్న వివరాలు తెలుసుకుందాం పదండి..


సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో (Prime Minister Modi viral videos) తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలోని (Delhi) లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఉంటున్న ఆవు.. ఓ దూడకు జన్మనిచ్చింది. మొదటిసారి ఇంట్లోకి అడుగుపెట్టిన దూడకు మోదీ ఘన స్వాగతం పలికారు. అంతేకాదు.. దూడను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని శాలువా కప్పి సన్మానించారు. అలాగే దేవుడి గదిలోని దేవీ విగ్రహం ఎదరుగా కూర్చున్న మోదీ.. దూడను పక్కనే పెట్టుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.

Viral Video: దేవుడు మనిషి రూపంలో రావడం అంటే ఇదేనేమో.. సమయానికి వచ్చి ఎలా కాపాడాడో చూస్తే..


ఈ సందర్భంగా దూడను మోదీ తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా నిమిరుతూ ముద్దు పెట్టారు. అంతేకాకుండా ఇంటి బయట గార్డెన్‌లో దూడతో చాలా సేపు అటూ ఇటూ నడుస్తూ సరదాదా గడిపారు. ఈ సందర్భంగా దూడ నుదిటిపై ఉన్న తెల్లటి గుర్తును చూపిస్తూ ‘‘ఇది కాంతికి చిహ్నంగా ఉంది’’.. అంటూ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఆ దూడకు దీపోజ్యోతి అని పేరు కూడా పెట్టారు.

Optical illusion: ఇక్కడున్న ‘‘राज’’ మధ్యలో ‘‘काज’’ ఎక్కడుందో.. 20 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఈ సంతోషకర క్షణాలను వివరిస్తూ.. ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9.60లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..

Viral Video: గణేశ్ విగ్రహాన్ని ఇలా తీసుకురావడం ఎక్కడైనా చూశారా.. ఇతను చేసిన స్టంట్ చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 14 , 2024 | 06:10 PM