Share News

Mahabubabad: భర్తకు దివ్యాంగురాలితో రెండో పెళ్లి చేసిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే..

ABN , Publish Date - Aug 29 , 2024 | 03:41 PM

ఏ మహిళ అయినా తన భర్త తనకు మాత్రమే సొంతమవ్వాలని కోరుకుంటుంది. భర్తే సర్వస్వంగా భావించే భార్య.. పరాయి మహిళ జోక్యాన్ని అస్సలు సహించదు. ప్రాణాలైనా వదులుకోవడానికి ఇష్టపడుతుంది కానీ.. భర్త మరో మహిళను ఇష్టపడడాన్ని మాత్రం కలలో కూడా ఒప్పుకోదు. అయితే ..

Mahabubabad:  భర్తకు దివ్యాంగురాలితో రెండో పెళ్లి చేసిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే..

ఏ మహిళ అయినా తన భర్త తనకు మాత్రమే సొంతమవ్వాలని కోరుకుంటుంది. భర్తే సర్వస్వంగా భావించే భార్య.. పరాయి మహిళ జోక్యాన్ని అస్సలు సహించదు. ప్రాణాలైనా వదులుకోవడానికి ఇష్టపడుతుంది కానీ.. భర్త మరో మహిళను ఇష్టపడడాన్ని మాత్రం కలలో కూడా ఒప్పుకోదు. అయితే అంతా ఇలాగే ఉంటారనుకుంటే పొరపాటే.. మానవతాదృక్ఫథంతో ఆలోచించే వారు కూడా ఉంటారు. తాజాగా, తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి రెండో వివాహం జరిపించింది. ఈ వివాహం వెనుక గల కారణాలు తెలుసుకుని అంతా ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..


మహబూబాబాద్ (Mahbubabad) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మానుకోట జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లికి చెందిన సురేష్, సరితలకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఇదిలావుండగా, సురేష్ మేనమామ వీరాస్వామికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే వారిలో చిన్న కూతురు సంధ్య మానసిక దివ్యాంగురాలు. ఆమె బాగోగులను ఎవరో ఒకరు చూసుకోవాల్సిన పరిస్థితి. దీంతో సంధ్యను వివాహం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

Viral Video: ఇందుకే హెల్మెట్ పెట్టుకోమని చెప్పేది.. పైనుంచి దూసుకొచ్చిన ప్రమాదం నుంచి ఇతనెలా తప్పించుకున్నాడంటే..


సంధ్యకు చిన్నప్పటి నుంచి సురేష్ అంటే ఇష్టం. పెళ్లి చేసుకుంటే సురేష్‌నే చేసుకుంటానని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు చివరకు ఈ విషయాన్ని సురేష్ దంపతుల వద్ద ప్రస్తావించారు. అయితే సంధ్యను వివాహం చేసుకునేందుకు సురేష్ భార్య సరిత అంగీకరించింది. దీంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పెళ్లికి అంగీకరించడమే కాదు.. తానే పెద్దగా వ్యవహరించి, పెళ్లిని దగ్గరుండి జరిపించింది.

Viral: కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన రోగి.. చివరకు స్కానింగ్ తీయగా పేగుల్లో షాకింగ్ సీన్..


మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని మార్కండేయ దేవాలయంలో అతిథుల సమక్షంలో ఈ వివాహం ఘనంగా జరిగింది. ఈ అరుదైన వివాహానికి వచ్చిన వారంతా సరిత తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. దీనిపై సరితను ప్రశ్నించగా.. మానసిక దివ్యాంగురాలైన సంధ్యకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. తన బోగులన్నీ తానే స్వయంగా చూసుకుంటానని తెలిపింది. దీంతో సరితను బంధువులంతా అభినందనలతో ముంచెత్తారు.

Viral Video: అరే.. పెద్ద కష్టమే వచ్చిందే.. చీర ధరించిన మహిళలు.. ఎస్కలేటర్‌ ఎక్కడంతో.. చివరకు..


అయితే ఈ సమయంలో మంటపంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. సంధ్య అక్క భర్త నాగరాజు ఈ పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తన మరదలిని వివాహమైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. అంతా మేజర్లు కావడంతో తామేమీ చేయలేమని వారంతా వెళ్లిపోయారు. కాగా, ఈ అరుదైన వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సురేష్ మొదటి భార్య తీసుకున్న నిర్ణయంపై నెటిజన్ల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Viral Video: అరటిగెలే కదా అని చేతులు పెట్టేస్తున్నారా.. కాస్త ఆగి చూడగా.. దిమ్మతిరిగే సీన్..

Updated Date - Aug 29 , 2024 | 03:57 PM