Share News

Viral Video: ఈ అమ్మాయి పెద్ద శాడిస్టులా ఉందే.. బస్సులో ప్రయాణికులను ఎలా హడలెత్తించిందంటే..

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:11 PM

లైకులు, వ్యూస్ కోసం కొంతమంది యువత ఎంతకు తెగించడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో వారు ప్రమాదంలో పడడమో, లేక ఎదుటివారిని ప్రమాదంలోకి నెట్టడమో జరుగుతుంటుంది. ఇటీవల ...

Viral Video: ఈ అమ్మాయి పెద్ద శాడిస్టులా ఉందే.. బస్సులో ప్రయాణికులను ఎలా హడలెత్తించిందంటే..

లైకులు, వ్యూస్ కోసం కొంతమంది యువత ఎంతకు తెగించడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో వారు ప్రమాదంలో పడడమో, లేక ఎదుటివారిని ప్రమాదంలోకి నెట్టడమో జరుగుతుంటుంది. ఇటీవల కొందరు యువతులు కూడా మరీ బరితెగించి ప్రవర్తిస్తున్నారు. బస్సులు, రైళ్లలో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రయాణికుల ఆగ్రహానికి గురవడం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ యువతి బస్సులో ప్రయాణికులను ఉన్నట్టుండి హడలెత్తించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ అమ్మాయి పెద్ద శాడిస్టులా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

టొరంటోలో (Toronto) గత ఏడాది చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ప్రయాణికులతో రద్దీగా ఉన్న ఓ బస్సులో ఓ యువతి రచ్చరచ్చ చేసింది. బస్సు ఎక్కిన కాసేపటికే ఎవరూ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. బస్సు బయలుదేరిన కాసేపటి తర్వాత మధ్యలో నిల్చున్న యువతి.. తన బ్యాగులోంచి బాణసంచా బయటకు తీసింది. కామెడీ కోసం అలా చేస్తోంది.. అది నిజమైన బాణసంచా కాదులే.. అనుకుని అంతా తాపీగా కూర్చున్నారు. అయితే అంతలోనే (young woman fired firecrackers in the bus) ఆమె దానికి నిప్పు అంటించింది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయపడిపోయారు. ‘‘వామ్మో..! చంపేసిందిరోయ్’’.. అనుకుంటూ పటాకు పేలేలోపు.. అంతా కింద పడకున్నారు. మరికొంత మంది అటూ ఇటూ దూరంగా జరిగారు.

Optical illusion: ఈ అడవిలో ఓ యాపిల్ దాక్కుని ఉంది.. దాన్ని గుర్తించడం మీ వల్ల అవుతుందేమో ట్రై చేయండి..

అంతలోనే బాణసంచా పొగలు కక్కుకుంటూ ఫట్ మని.. పెద్ద శబ్ధంతో పేలిపోయింది. దాన్నుంచి వచ్చిన నిప్పు రవ్వలు బస్సు వెనుక వైపు దూసుకెళ్లాయి. దీన్ని గమనించిన డ్రైవర్ బస్సును సడన్‌గా ఆపేశాడు. దీంతో అంతా గట్టిగా కేకలు వేస్తూ బస్సు దిగి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రవాణా శాఖ అధికారులు స్పందించారు. ఘటనపై పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘రీల్స్ కోసం ఇలాంటి వారు ఎంతకైనా తెగిస్తారు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రమాదకర పనులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పనులు చేసేవారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో..! ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా.. వందల కొద్దీ టమాటాలను.. ఒక్క వేటుతో..

Updated Date - Feb 25 , 2024 | 04:11 PM