Share News

Jaggareddy: ప్రజా సంక్షేమం కోరే బడ్జెట్ ఇది

ABN , Publish Date - Jul 25 , 2024 | 09:48 PM

ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం తమదని.. దానిని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.

Jaggareddy: ప్రజా సంక్షేమం కోరే బడ్జెట్ ఇది
Jaggareddy

హైదరాబాద్: ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం తమదని.. దానిని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉందని తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ... గత పదేళ్ల కాలంలో హైప్ బడ్జెట్ తప్ప ఏం లేదని చెప్పారు.


కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రాక్టీకల్‌గా ఉందన్నారు. కేసీఆర్ పదేళ్ల బడ్జెట్ ఊహల్లో విహరించిన బడ్జెట్ అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉంటుందని స్పష్టం చేశారు. గాంధీ భవన్ ద్వారా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మండలిలో ప్రవేశ పెట్టిన మంత్రి శ్రీధర్ బాబులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయానికి పెద్ద పీట వేయడంతో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని ఉద్ఘాటించారు. గత పదేళ్లు.. కేసీఆర్ ప్రభుత్వం అప్పులకే ప్రాధాన్యత ఇచ్చిందని జగ్గారెడ్డి ఆరోపించారు.


కాగా.. మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రూ. 2,91,191 కోట్లు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రాష్ట్ర తలసరి ఆదాయం, అప్పులు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం వంటి వివరాలను మంత్రి భట్టి వెల్లడించారు. అలాగే, బడ్జెట్‌లో ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారు.. ఈ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారనే వివరాలను బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి వివరించారు .


పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో తెలంగాణ రైతాంగం ఎంతో నష్టపోయిందని.. రైతు సాధికారత దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని తక్కువ కాలంలోనే నిరూపించామని భట్టి విక్రమార్క తన ప్రసంగంలో తెలిపారు. వివిధ రంగాలకు కేటాయింపులను ఆయన సభలో వివరించారు. మొత్తంగా రూ.2, 91, 191 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

Updated Date - Jul 25 , 2024 | 09:48 PM