TG Politics: సీఎం రేవంత్ వైఖరితోనే కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డు మీదకు.. సబిత ఇంద్రారెడ్డి ధ్వజం
ABN , Publish Date - Oct 26 , 2024 | 04:41 PM
ఏక్ పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్రెడ్డి మాటను నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సబిత ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. 18రోజులకు 4రోజులు కుటుంబంతో గడిపే పాత పద్ధతిని కొనసాగించాలని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారాయని ఆరోపించారు.
హైదరాబాద్: కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్రెడ్డి వైఖరే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సబిత ఇంద్రారెడ్డి ఆరోపించారు. హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ ఫెయిల్ అవ్వటంతోనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయని చెప్పారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్లో సబిత ఇంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... రక్షకభటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కటం బాధాకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ALSO READ: Hyderabad: 'పాలు తాగే పిల్లాడున్నాడు.. వదిలేయండి ప్లీజ్'.. బెటాలియన్ పోలీసుల నిరసనల్లో తల్లి ఆవేదన
పోలీసులు రోడ్డు ఎక్కటం చరిత్రలోనే మెదటసారి అని చెప్పారు. ప్రజా పాలన అంటే.. ఇదేనా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. తెలంగాణలో హోంమంత్రి లేకపోవటంతోనే. కానిస్టేబుళ్ల బాధ ఎవరకి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. యూనిఫాం వేసుకుని దర్నాలు చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చిందని.. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరమని చెప్పారు. ఏక్ పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 18రోజులకు 4రోజులు కుటుంబంతో గడిపే పాత పద్ధతిని కొనసాగించాలని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారాయని అన్నారు. డీజీపీ స్థాయి అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ALSO READ: Jaggareddy: ఎవ్వరినీ వదలా... మీడియాపై జగ్గారెడ్డి ఫైర్
పోలీస్ సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
స్వాతంత్రం దేశంలో పోలీసులే నిరసన చేపట్టడం తొలిసారి అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. పోలీసులతో ఇళ్లలో వివిధ పనులు చేర్పిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీస్ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వం కోరారు. సచివాలయం ముందు రోజూ ధర్నాలు జరగటం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ఉందా? అనే అనుమానం కలుగుతోందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Lawrence Bishnoi: జైల్లో గ్యాంగ్స్టర్ ఇంటర్వ్యూ.. డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులపై వేటు
TG Police: పోలీసు, పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారిన అజ్ఞాత వ్యక్తి లేఖ..
Read Latest Telangana News And Telugu News