దక్షిణ కోస్తా, రాయలసీమలకు వర్షసూచన

ABN , First Publish Date - 2022-11-07T21:26:06+05:30 IST

ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఈ నెల తొమ్మిదో తేదీన శ్రీలంక (Sri Lanka)కు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది.

దక్షిణ కోస్తా, రాయలసీమలకు వర్షసూచన
rain

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఈ నెల తొమ్మిదో తేదీన శ్రీలంక (Sri Lanka)కు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. ఇది తరువాత వాయువ్యంగా పయనించి వాయుగుండంగా బలపడి తమిళనాడు, పుదుచ్చేరి దిశగా పయనించనున్నది. అయితే ఈనెల 11వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరి (TamilNadu Puducherry) మధ్య తీరం దాటే అవకాశం వుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఈనెల తొమ్మిదో తేదీ నుంచి నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం కల్లోలంగా మారుతుందని పేర్కొన్నారు.

దీంతో ఈనెల 10, 11 తేదీల్లో దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొదని హెచ్చరించారు. ఇంకా ఆ రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ (Rayalaseema)లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కాగా సోమవారం కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొంది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఆరోగ్యవరంలో 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2022-11-07T21:30:13+05:30 IST

Read more