Munugode TRS: మునుగోడు‌లో టీఆర్‌ఎస్ గెలుపు వెనుక ఇంత ఉందా..?

ABN , First Publish Date - 2022-11-07T20:19:52+05:30 IST

ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్ల కాలంలో మూడు ఉప ఎన్నికలు జరగ్గా, ఈ మూడు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుపొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (Chief Minister KCR) శిష్యుడిగా పేరొందడమే గాక...

Munugode TRS: మునుగోడు‌లో టీఆర్‌ఎస్ గెలుపు వెనుక ఇంత ఉందా..?

నల్గొండ: ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్ల కాలంలో మూడు ఉప ఎన్నికలు జరగ్గా, ఈ మూడు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుపొందారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (Chief Minister KCR) శిష్యుడిగా పేరొందడమే గాక పార్టీ ఆవిర్భావ కాలం నుంచి ఆయన వెంటనే ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని (Nalgonda District) 12 నియోజకవర్గాల్లో పార్టీని పటిష్ఠం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుంటూ అక్కడి ప్రజలకు కావాల్సిన పథకాలు, అభివృద్థి, సంక్షేమ పథకాలు వంటివి అమలు చేస్తూనే మరోవైపు గులాబీ పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసుకుంటూ నిత్యం ప్రజలతో, పార్టీ శ్రేణులతో మమేకమవుతూ వస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ (CM KCR) ఆదేశాలకు అనుగుణంగా ఉప ఎన్నిక వచ్చిన సమయంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ (Operation Akarsh) వంటి కార్యక్రమాలతో మైండ్‌ గేమ్‌ ద్వారా ఎదుటి పార్టీకి ప్రజాప్రతినిధులు లేకుండా చేశారు. అంతేగాక ఉప ఎన్నిక వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలకు కనీసం ఏజెంట్లు కూడా దొరకని విధంగా ఎత్తులు వేస్తూ వ్యూహంతో ముందుకు సాగుతూ ఉప ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. ఉప ఎన్నికలో ప్రచారం నిర్వహించేందుకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులకు ఆయా ప్రాంతాల్లో వారికి అన్ని సౌకర్యాలు కల్పించి పార్టీ గెలుపునకు వారు సహకరించేలా సమన్వయం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో (Congress Party) రాష్ట్రంలోనే దిగ్గజాలుగా పేరొందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని (PCC Ex Chief Uttam Kumar Reddy), సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డిని (Jana Reddy), కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీలో చేరి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని (Komatireddy Rajagopal Reddy) వరుస ఉప ఎన్నికల్లో తన మంత్రాంగంతో మంత్రి జగదీష్ రెడ్డి ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు సాధించారు.

Updated Date - 2022-11-07T21:16:03+05:30 IST

Read more