Share News

Viral Video: పీహెచ్‌డీ చేస్తూ చికెన్ పకోడీ వ్యాపారం.. వైరల్ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..

ABN , Publish Date - Oct 04 , 2024 | 01:04 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను పంచుకుని వాటిపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. . పీహెచ్‌డీ చదువుకుంటూ, రోడ్డు పక్కన స్టాల్ పెట్టుకుని చికెన్ పకోడీ అమ్ముకుంటున్న యువకుడికి సంబంధించిన వీడియోపై స్పందించారు.

Viral Video: పీహెచ్‌డీ చేస్తూ చికెన్ పకోడీ వ్యాపారం.. వైరల్ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..
Anand Mahindra

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కూడా తగినంత సమయం కేటాయిస్తుంటారు. సోషల్ మీడియాలో తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను పంచుకుని వాటిపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. పీహెచ్‌డీ చదువుకుంటూ (PhD student ), రోడ్డు పక్కన స్టాల్ పెట్టుకుని చికెన్ పకోడీ (chicken pakora) అమ్ముకుంటున్న యువకుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. వీదేశీ యువకుడు ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు (Viral Video).

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. తాజాగా ఆనంద్ మహీంద్రా కూడా ఆ వీడియోపై తన స్పందన తెలిపారు. ``కొన్ని రోజులుగా ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీహెచ్‌డీ చదువుకుంటున్న ఓ కుర్రాడు పార్ట్ టైమ్‌గా రోడ్డు పక్కన స్టాల్ పెట్టుకుని చికెన్ పకోడీ అమ్ముకుంటున్న వీడియోను ఓ అమెరికన్ వ్లాగర్ షేర్ చేశాడు. ఈ వీడియోలో నాకు బాగా నచ్చింది ఏంటంటే.. వీడియో చివర్లో ఆ కుర్రాడు ఆ వ్లాగర్ ఫోన్ తీసుకున్నప్పుడు.. తన ఫుడ్ స్టాల్ గురించి గూగుల్‌లో చూపిస్తున్నాడు అనుకున్నాడు. కానీ, ఆ కుర్రాడు తన రీసెర్చ్ పేపర్లను గర్వంగా చూపించాడు. ఇంక్రెడిబుల్ యునిక్ ఇండియన్`` అంటూ ఆనంద్ కామెంట్ చేశారు.


ఆనంద్ షేర్ చేసిన ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. 12 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ``పీహెచ్‌డీ స్టూడెంట్ తన స్కిల్స్‌ను రీసెర్చ్‌లో ఉపయోగించాలి. చికెన్ పకోడీ చేయడంలో కాదు. అతడు ఉండాల్సిన చోట ఉండలేకపోవడం మన వైఫల్యం``, ``శ్రమ, తెలివితేటలు, ఔదార్యం.. ఇదే భారతీయుల గొప్పదనం``, ``నిజమే.. అతడిని మన వ్యవస్థ దిగజార్చింది. అతడికి దక్కాల్సింది దక్కలేదు. కానీ, రాయన్ ఆ సిట్యుయేషన్‌ను హ్యాండిల్ చేసిన విధానం చాలా గొప్పగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ప్రేయసితో కలిసి స్కూటీపై వెళ్తున్న భర్త.. అతడి భార్య ఎలాంటి షాకిచ్చిందంటే.. వీడియో వైరల్..


Viral Video: పాకిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం.. పెద్ద గుంత నుంచి మనుషులు బయటకు ఎలా వస్తున్నారో చూడండి..


IQ Test: మీ తెలివికి సవాల్.. ఈ ఫుట్‌బాల్ గేమ్‌లోని తప్పును 10 సెకెన్లలో కనుక్కోండి..


Viral Video: నర్సరీ టీచర్ల అంకిత భావానికి హ్యాట్సాఫ్.. ఫన్నీ టమాటా రైమ్ వీడియో వైరల్..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 04 , 2024 | 01:04 PM