Share News

Mamata Banerjee: జూనియర్ వైద్యులను మళ్లీ చర్చలకు ఆహ్వానించిన సీఎం

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:28 PM

ఆర్జీ కర్ ఆర్జీ కర్ జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతూ జూనియర్ వైద్యులు ఆరోగ్య శాఖ ప్రధానకార్యాలయమైన 'స్వాస్థ్వ భవన్' ఎదుట జరుపుతున్న బైఠాయింపు నిరసనలు సోమవారంతో 8వ రోజుకు చేరుకున్నాయి.

Mamata Banerjee: జూనియర్ వైద్యులను మళ్లీ చర్చలకు ఆహ్వానించిన సీఎం

కోల్‌కతా: ఆర్జీ కర్ జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా కోల్‌కతాలో నిరసనలు చేస్తున్న వైద్యులను చర్చలకు రావాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) సోమవారంనాడు మరోసారి ఆహ్వానించారు. సాయంత్రం 5 గంటలకు చర్చలు జరుగనున్నాయి. చర్చలకు పిలవడం ఇది ఐదోసారి, చివరిసారి అని బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వైద్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతూ జూనియర్ వైద్యులు ఆరోగ్య శాఖ ప్రధానకార్యాలయమైన 'స్వాస్థ్వ భవన్' ఎదుట జరుపుతున్న బైఠాయింపు నిరసనలు నేటితో 8వ రోజుకు చేరుకున్నాయి. 36 రోజులుగా వీరు విధులకు దూరంగా ఉంటున్నారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులను తొలగించాలని కూడా జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను రాష్ట్రప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం విడ్డూరంగా ఉందని వైద్యులు అంటున్నారు.

Narendra Modi: ప్రధాని మోదీ పుట్టినరోజు నేపథ్యంలో.. 13 ఏళ్ల చిన్నారి స్పెషల్ గిఫ్ట్

ABN ఛానల్ ఫాలో అవ్వండి

చర్చలకు పిలిచి..వెనక్కి తగ్గి

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత శనివారంనాడు అనూహ్యంగా జూనియర్ వైద్యుల నిరసన శిబిరానికి వెళ్లి చర్చలకు రావాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వైద్యులపై ఎలాంటి కక్షసాధింపులు ఉండవని భరోసా ఇచ్చారు. ఆ రోజు సాయంత్రమే సీఎం నివాసంలో చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. వైద్యులు సీఎం నివాసానికి వెళ్లినా చర్చలు మాత్రం జరగలేదు. సమావేశం కోసం మూడు గంటలు వేచి ఉన్నామని, ఆలస్యమైన కారణంగా ఇప్పుడు చర్చలు నిర్వహించలేమని సీఎం కార్యాలయం చెప్పడంతో వారు వెనుదిరిగారు. చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని తొలుత పట్టుబట్టిన వైద్యులు ఆ విషయంలో వెనక్కి తగ్గినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో మమతా బెనర్జీ సోమవారం మరోసారి జూనియర్ వైద్యులను చర్చకు పిలవడంతో ఈసారైనా ప్రతిష్ఠంభనకు తెరపడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.


For MoreNational NewsandTelugu News

Also Read: Uttar Pradesh: భారీ వర్షాలతో యూపీ అతలాకుతలం : 14 మంది మృతి

Also Read: Uttar Pradesh: మళ్లీ తోడేలు దాడి: బాధిత కుటుంబాలతో సీఎం యోగి భేటీ

Updated Date - Sep 16 , 2024 | 01:33 PM